తెలంగాణ మీడియా అకాడమీని సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అల్లం నారాయణ వివరంగా కమ్మినేనికి వివరించారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి అకాడమీ నిర్వహించిన శిక్షణ తరగతులు, సెమినార్లు ఇతర కార్యక్రమాలు తెలిపారు. అలాగే మీడియా అకాడమీ ప్రచురణలు, ఇతర వివరాల నోట్ అందజేశారు. ఇద్దరు చైర్మన్లు ఒకరినొకరు శాలుతో సత్కరించారు. తెలంగాణ అకాడమీ సెక్రెటరీ నాగులాపల్లి వెంకటేశ్వర రావు, ఇరు అకాడమీల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.













