ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 18 వరకు గడువు ఉంది. అద్దంకి దయాకర్‌తో పాటు బల్మూరి వెంకట్‌కు అవకాశం ఇచ్చినట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ మహేశ్ కుమార్ గౌడ్‌కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి విడివిడిగా నిర్వహించనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం ఉన్నందువల్ల రెండు స్థానాలనూ గెలిచేందుకు అవకాశముంది.













