చరిత్ర సృష్టించిన రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రికార్డ్ స్థాయి లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.9,516 కోట్లకు ఎగసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. షేర్ పరంగా చూస్తే నికర లాభం రూ.16.1 నుంచి 18.6కు పెరిగింది. ఒక్క క్వార్టర్లో ఈ స్థాయి లాభం సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి. అత్యదిక త్రైమాసిక లాభం సాధించిన ప్రైవేట్ కంపెనీగా తన రికార్డ్‌ను తానే రిలయన్స్ ఇండస్ట్రీస్ బద్దలు కొట్టింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఈ కంపెనీ రూ.10,362 కోట్ల నికర లాభం సాధించింది. ఈ క్యూ2లో ఈ రికార్డ్‌ను బ్రేక్ చేఐసిది. స్లాండ్అలోన్ పరంగా చూసినా, ఈ క్యూ2లో రికార్డ్ నికర లాభం రూ.9,702 కోట్లను ఈ కంపెనీ సాధించింది.













