బీసీసీఐ నుంచి రామచంద్ర గుహ ఔట్
బీసీసీఐలో లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) నుంచి రామచంద్ర గుహ తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను తప్పుకుంటున్నట్లు గుహ వెల్లడించారు. తనను రిలీవ్ చేయాల్సిందిగా గుహ వేసిన పిటిషన్పై జులై 14న సుప్రీంకోర్టు విచారణ జరపనున్నది. ఈ ఏడాది జనవరి 30న సుప్రీంకోర్టు సీఓఏను నియమించిన విషయం తెలిసిందే. ఇందులో రామచంద్ర గుహతోపాటు మాజీ కాగ్ వినోద్ రాయ్, మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ, విక్రమ్ విమాయే ఉన్నారు. సీఓఏ కీలక నిర్ణయాలు తీసుకొనే సమయంలో రామచంద్ర గుహ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. లోధా సిఫారసులను సీఓఏ ఇంకా పూర్తిగా అమలు కూడా చేయలేదు.













