రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల వేడుక
పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పలువురు అవార్డులను స్వీకరించారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పద్మ విభూషణ్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రకాంత్ పితవా, దరిపల్లి రామయ్య, బీవీఆర్ మోహన్ రెడ్డి పద్మ శ్రీ అవార్డులను స్వీకరించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ తదితరులు పాల్గొన్నారు. వి. కోటేశ్వరమ్య పద్మశ్రీ అవార్డు తీసుకోవాల్సి ఉన్నా కార్యక్రమానికి హాజరుకాలేదు.













