రాష్ట్రపతి ఉగాది శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దేశ వ్యాప్తంగా భారతీయులు జరుపుకోనున్న చైత్ర శుక్లాది, ఉగాది, గుడిపడవా, చీటీ చాంద్, నవర్హే, సైజిబు చీరాబో వంటి పలు పండగలను పురస్కరించుకుని రాష్ట్రపతి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగలు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతాయని, సుఖసంతోషాలకు చిహ్నాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ప్రజల మధ్య సహనం, సామరస్య వైఖరి వెల్లివిరియాలని ఆయన కోరారు.







