మోడీ టీమ్‌లో తెలంగాణ ఆడబిడ్డకు స్థానం
ఐఎస్ అధికారిణుల్లో ఫైర్‌బ్రాండ్ ముద్ర వేసుకున్న బి.చంద్రకళ ఇప్పుడు ప్రధాని మోడీ డ్రీమ్ టీమ్‌లో చోటు సంపాదించుకున్నారు. 2008 బ్యాచ్‌కు చెందిన ఈ యూపీ కేడర్ అధికారిణి రెండేళ్ల క్రితం రాష్ట్రంలో నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన సోషల్ మీడియాలో భారీగా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో చంద్రకళ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. బులంద్‌షహర్, మీటర్, బిజ్నూర్ తదితర పట్టణాల్లో క్లీన్ ఇండియా ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇవన్నీ ఆమెను మోడీ దృష్టిలో పడేలా చేశాయి. ప్రధాని తాజాగా ఆమెకు మంచి గుర్తింపు నిచ్చారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు స్వచ్ఛ భారత్ మిషన్‌కు చంద్రకళను డైరెక్టర్‌గా నియమించారు. ఐఎఎస్ చంద్రకళ సొంత రాష్ట్రం తెలంగాణ కావడం వివేషం.







