అజ్మీర్ దర్గాకు ప్రధాని మోడీ ఛాదర్
ప్రసిద్ధి అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ హిద్దీన్చిష్తికి ప్రధాని నరేంద్ర మోడీ ఛాదర్ పంపించారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, పిఎంఓలో సహాయ మంత్రి జితేంద్రసింగ్ దాన్ని అలంకరించారు. ఈ నెల 30 నుంచి చిష్తిలో ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు అందజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెయినుద్దీన్ మద్దతుదారులకు ఆయన ఓ సందేశం ఇచ్చారు. ఆధ్మాత్మిక భారతావనిలో ఖ్వాజా పాత్రను మరువలేమని మోడీ సృష్టం చేశారు. ఆరోశతాబ్దానికి చెందిన ఖ్యాజా చిష్తి సుఫీల ప్రవక్తగా గణతికెక్కారు. ఆయనను గరీబ్ నవాజ్ (పేదల పెన్నిది)గా కొలుస్తుంటారు. ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరగాలని మోడీ ఆకాంక్షిస్తున్నారని పిఎంఓ ప్రకటనలో పేర్కొంది.













