వెంకయ్య మనవరాలికి ప్రధాని మోదీ అభినందన
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మనవరాలు సుష్మను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఉగాది సంబరాల్లో పాల్గొనడానికి తమ ఇంటికి వచ్చిన ప్రధానికి తాను స్వయంగా గీసిని మోదీ చిత్రాన్ని ఆమె బహుకరించారు. ఆమె గీసిన తన చిత్రాన్ని చూసుకొని మోదీ మురిసిపోయ్యారు. శభాష్ బేటి అంటూ నువ్వు చిత్ర కారిణివా? అని అడిగారు. దానికి అమె స్పందిస్తూ కళాకారిణిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను అని సమాధానమిచ్చారు. కాగా, ప్రధాని ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల గురిచి ఆమె ఒకే చిత్రంలో వివరించడం విశేషం.













