విమాన ప్రయాణికులకు శుభవార్త
విమాన ప్రయాణికులు తమతో పాటు వెంట తీసుకెళ్లదగ్గ చేతి బ్యాగేజీపై ఏప్రిల్ 1 నుంచి ముద్రలు వేయడం, ట్యాగ్లు కట్టడం ఉండదని కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబాయి, కోల్కతా, కొచ్చిన్, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ఇది అమలవుతుందని తెలిపింది. ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేయడానికి ఉద్దేశించిన ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి అవసరమైన భద్రతా వ్యవస్థలను తెచ్చామని వివరించింది. నిజానికి ఈ నిర్ణయాన్ని పౌర విమానయాన భద్రతా బ్యూరో లోగడే ప్రకటించింది. అయితే భద్రతాపరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసేందుకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సీఐఎస్ఎఫ్ భావించడంతో దాని అమలులో జాప్యం జరిగింది.













