Y.S. Sharmila: ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ఇవ్వరా?: వైఎస్ షర్మిల
పవిత్ర రంజాన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్(Iftar) విందు ఇవ్వడం సరేగానీ, పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ఎందుకివ్వడం లేదని కూటమి సర్కారును ఏపీసీసీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y.S. Sharmila) ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లుగా రంజాన్ తోఫాపై తొండాటలు ఏమిటని సీఎం చంద్రబాబును షర్మిల నిలదీశారు. రాష్ట్రంలోని 12 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ఇవ్వరా? అని ప్రశ్నించారు. మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ముస్లిం మైనారిటీ కుటుంబాల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేయడం భారమయ్యిందా? అని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి








