గవర్నర్‌ను కలిసిన యార్లగడ్డ
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గవర్నరు విశ్వభూషణ్ హరిచందన్‌ను రాజ్‌భవన్‌లో మర్వాదపూర్వకంగా కలిశారు. తెలుగు సాహిత్య ప్రక్రియలను హిందీ భాషలోకి అనువదించడం ద్వారా ఉత్తర, దక్షిణ భారతదేశానికి మధ్య సాహిత్య వారధిగా పనిచేస్తున్న క్రమాన్ని గవర్నరుకు యార్లగడ్డ వివరించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా తాను అనువదించి, రచించిన సాహితీ సంపుటాల పుస్తకాన్ని గవర్నర్‌కు ఆయన బహుకరించారు. పలువురు కవులు రచించిన కావ్యాలతో రూపొందించిన తాళపత్ర గ్రంథపేటికను విశ్వభూషణ్ హరిచందన్‌కు అందజేయగా ఆయన ఆసక్తిగా తిలకించారు.













