ఈ విధానంలో జగన్ సక్సెస్ అవుతారా? : ఉండవల్లి

వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఎందుకు అప్పగించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాతీయ ప్రాజెక్టును కేంద్రం కట్టాలని, చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. జగన్ ఇప్పుడు ఎందుకు అదే కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకు ఇక్కడ అవవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడమని కేంద్రం భావిస్తోందన్నారు. మన ఎంపీలు గట్టిగా అడగలేరు. ఇప్పటి వరకు ఎప్పుడైనా పార్లమెంట్‌లో అడిగారా? అని ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టం ఎందుకు అమలు చేయట్లేదని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు అని మండిపడ్డారు.
ప్రజలకు డబ్బులు ఇచ్చాను. వాళ్లు నాకు ఓటు వేయాలని ఇదే జగన్ విధానం అన్నారు. అసలు క్విడ్ ప్రోక్ అంటే ఇదే. ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వరు. ఈ విధానంలో జగన్ సక్సెస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి గ్యాంబ్లింగ్ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు. ఎంతకాలం డబ్బులు పంచగలడు, ఎక్కడ్నుంచి తేగలడు. కేంద్రం నిధుల మళ్లింపై విచారణ జరుగుతోందట. విచారణలో ఫలితం ఏమొచ్చినా జగన్ ఏమీ ఫీల్ కారు. ఎందుకంటే పేద ప్రజలకు ఇచ్చానంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే సంక్షోభం ఏర్పడిరది అని ఉండవల్లి అన్నారు.