కోర్టు తీర్పు ఎలా ఉన్నా .. 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం : మంత్రి లోకేశ్
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan)కు వచ్చిన లోకేశ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంలో పూర్తి సృష్టతతో ఉన్నట్లు చెప్పారు. కోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీ పరంగా 34 శాతంపై స్థానాలను బీసీలకు ఇచ్చి తీరుతామన్నారు. రిజర్వేషన్లు ఖరారు కాకుండా అభ్యర్థిని ప్రకటించిన ఘనత గొడ్డలి పార్టీకే దక్కింది. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు వారు చేస్తున్న కుట్రలు అందరూ చూస్తున్నారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) వరకు వెళ్లారు. స్థానిక ఎన్నికల తర్వాత కాలపరిమితి పూర్తయిన నామినేటెడ్ పదవుల భర్తీపై సమీక్షిస్తాం. పని చేసిన వారికే నామినేటెడ్ పదవుల రెన్యువల్ ఉంటుంది అని అన్నారు.








