భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం (Bheemili constituency)లో వైసీపీ (YCP)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు టీడీపీ (TDP)లో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) వారికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేస్తున్న అభివృద్ధి చూసి కూటమిలో చేరుతున్నారని ఈ సందర్బంగా గంటా అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.








