ఆంధ్రాలో వార్ వన్ సైడ్ అంటున్న సర్వేలు..
ఏపీ లో ఇంకొక నెల రోజుల్లో అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారాలతో బిజీగా ఉన్నాయి. వైసిపి సిద్ధమంటే టీడీపీ – జనసేన కూటములు సంసిద్ధం అంటూ హడావిడి చేస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న ఈ నేపథ్యంలో సర్వేల సందడి కూడా మొదలైపోయింది. పలు సంస్థలు నిర్వహిస్తున్న ఈ సర్వేలు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. అయితే దాదాపు ఇప్పటివరకు విడుదలైన మెజారిటీ సర్వేల ప్రకారం విజయం వైకాపా వైఫై కనిపిస్తోంది. అయితే ఈ సర్వేలను నమ్మేది లేదు ప్రజలనే నమ్ముతాం అంటున్నారు టీడీపీ, జనసేన కూటములు. తాజాగా టైమ్స్ నౌ ,ఈ టీజీ సర్వే కూడా జగన్ కే ఫేవర్ గా వచ్చింది. అయితే ఇంకా బీజేపీ…టీడీపీ మధ్య జరుగుతున్న చర్చల రిజల్ట్ ఇంకా రాలేదు. ఒకవేళ కమలం సపోర్ట్ సైకిల్ కి దొరికితే ఈ సర్వే రిపోర్ట్ లు మారే అవకాశం కూడా ఉంది. అయితే ఎన్డీఏ కూటమి ప్రభావం శూన్యం అని నొక్కి వక్కాడిస్తోంది టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే. రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మొత్తానికి ఈ వార్త మాత్రం వైసీపీ శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.













