ఇది ఆరంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో : విజయసాయి రెడ్డి

ఉద్యోగ కల్పలో ఆంధ్రప్ర్రదేశ్ ప్రభుత్వం ముందుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. తిరుపతిలో నిర్వహించనున్న వైసీపీ జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లను విజయసాయి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాబ్ మేళా ఏర్పాట్లు పూర్తయినట్టు తెలిపారు. కులమతాలకు అతీతంగా అందరికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఇలాంటి జాబ్ మేళ తరహాలో నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏ రకంగా పెంచాలి. తలసరి ఆదాయం ఎలా పెంచాలనే దానిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వివరించారు.
75 శాతం ఉద్యోగులకు స్థానికులకు కల్పించాలని చట్టం తెచ్చామన్నారు. జాబ్ మేళకు హాజరయ్యే అభ్యర్థులు వైఎస్‌ఆర్‌సీపీ జాబ్ మేళా డాట్ కామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వారికి పార్టీ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అది చూపించిన వారిని ఇంటర్వ్యూలకు యూనివర్సిటీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. కన్‌ఫర్మేషన్ మెస్సేజ్ తప్పకుండా చూపించాలి. నిరుద్యోగులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి సదవకాశం కల్పిస్తోంది. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ఘనత వైసీపీ అధినేత జగన్‌కే దక్కుతుందని అన్నారు.