ములాఖత్ కోసమే … జన సమీకరణ చేస్తే చట్టపరమైన చర్యలు : ఎస్పీ మహేశ్వర్ రెడ్డి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) గురువారం శ్రీకాకుళం (Srikakulam)లో పర్యటించనున్నారు. అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju)తో ఆయన ములాఖత్ కానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ( Maheshwar Reddy) మీడియాతో మాట్లాడారు. జగన్ పర్యటనకు జన సమీకరణ చేయకూడదని తెలిపారు. జైలులో ములాఖత్ కోసమే అనుమతి తీసుకున్నారన్నారు. బహిరంగ సభ, ర్యాలీకి అనుమతి తీసుకోలేదని, జన సమీకరణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ చేసిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య ( Kapari Danayya) మృతి చెందిన విషయం తెలిసిందే. కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు సాక్ష్యాలను తారుమారు చేశారంటూ అప్పలరాజుపైనా కేసు నమోదైంది. ఇటీవల పోలీసులు అయన్ను అరెస్ట్ చేయగా, కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అప్పలరాజును అంపోలు జైలుకు తరలించారు.








