వైసీపీ తీర్దం పుచ్చుకోనున్న శేష కుమారి.. షాక్ లో జనసేన..
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తాను అని ప్రకటించినప్పటి నుంచి పలు రకాల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసిన శేష కుమారి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అన్న వార్త వైరల్ అయింది. ప్రస్తుతం శేష కుమారి జనసేన నియోజకవర్గం ఇన్చార్జిగా వ్యవహరిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి శేష కుమారి టికెట్ ఆశించారట. అయితే స్వయంగా జనసేన అని పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించడంతో ఆమె అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో నుంచి వైసీపీ తరఫున పెండెం దొరబాబు 14 వేల మెజారిటీతో గెలుపొందారు. ఇతనిపై పోటీ చేసిన టిడిపి అభ్యర్థి వర్మకు 68 వేల ఓట్లు రాగా.. జనసేన క్యాండిడేట్ శేషకుమారికి 28 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ,జనసేన పొత్తుతో పిఠాపురంలో తాను గెలవడం కన్ఫామ్ అని భావిస్తున్న శేషకుమారి అశలను పవన్ ఎంట్రీ నిరుగార్చింది . అందుకే ఆమె వైసీపీకి వెళ్లడానికి నిర్ణయించుకుంది. అయితే ఇంకా ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు. ఒకవేళ ఇదే జరిగితే పిఠాపురంలో జనసేన పార్టీకి ఇది పెద్ద షాక్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు.













