కుల రాజకీయాలుగా మారుతున్న.. ఆంధ్ర రాజకీయం..
కులాలు ప్రతి దగ్గర ఉంటాయి కానీ వాటితో రాజకీయం చేయడం మాత్రం ఆంధ్రాలోనే ఎక్కువగా చూస్తున్నాం. దేశంలో ఎక్కడా కులాల గురించి ఇంత పట్టింపు మనం చూడం ఆశ్చర్యం లేదు. రాజకీయాలు వచ్చే సరికి కులాలు తప్పనిసరిగా పట్టించుకుంటారు అనేది ఒక ఓపెన్ సీక్రెట్. కేవలం పార్టీ నాయకుడు తమ కులానికి చెందిన వాడు అనే ఉద్దేశంతో పార్టీలకు గుడ్డిగా ఓట్లు వేసే ఓటర్లు మన దగ్గర చాలామంది ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రెడ్లు అందరూ దాని వైపు వెళ్లారు. అంతకుముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపులు తమకి కూడా ఒక పార్టీ వచ్చింది అని ఆనందిచారు. అయితే ఆ పార్టీ ఎక్కువ రోజులు నిలబడ లేదు.తెలుగుదేశం పార్టీకి కమ్మ పార్టీ అన్న బ్రాండ్ ఫిక్స్ అయిపోయింది. కానీ ఆ పార్టీ మాత్రం మొదటి నుంచి అన్ని సామాజిక వర్గాల వాళ్ళని ఆదరిస్తూ వస్తోంది. ఇక పవన్ జనసేన ఎంట్రీ తో కాపులు మళ్ళీ సంతోషపడ్డారు. మొదట్లో పవన్ పై కూడా అనుమానాలు ఉన్నాయి.. అయితే ఇప్పుడు మాత్రం ఆంధ్రా లో కాపులు కేరాఫ్ అడ్రస్ పవనన్నట్లుగా వాతావరణం మారుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఇంపాక్ట్ కచ్చితంగా కనిపించే అవకాశం ఉంది అని టాక్. ఈసారైనా జనసేనాని కూటమి కారణంగా చేతికి వచ్చిన కాస్త సీట్లలో అయినా పరువు నిలబెట్టుకుంటాడేమో చూడాలి.













