సామాజిక న్యాయం అంటే ఇదేనా? : అనురాధ
జగన్ చేసింది సామాజిక న్యాయం కాదని, సామాజిక ద్రోహమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం చేసి బీసీలను తానే ఉద్దరించినట్టు సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. పల్నాడులో 12 మంది బడుగు, బలహీన వర్గాలు హత్య గావించబడితే నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారు? సామాజిక న్యాయం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. జాలయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న లోకేశ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించటం దుర్మార్గమన్నారు. పేరుకే బీసీలకు మంత్రి పదవులు.. పెత్తనమంతా సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిలదేనని విమర్శించారు. దేశంలోని రాజకీయ నాయకుల్లో పచ్చి అబద్దాల కోరుగా సీఎం జగన్ గిన్నిస్ బుక్‌లో పేరు రికార్డు నమోదు చేయూలని అన్నారు.













