లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ బాలయోగి ఆహ్వానం
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ (Vijayawada)లో నిర్వహించబోయే ఉత్సవాలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)ను ఆహ్వానించారు. అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి (Harish Balayogi) లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker)ను కలిసి ఆహ్వానం అందించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని చాటిచెప్పేలా నిర్వహించబోతున్న ఈ ఉత్సవాల్లో పాలుపంచుకొని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఇప్పటివరకు రాష్ట్రపతి (President) నుంచి పలువురు ప్రముఖులను ఆహ్వానించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.








