నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం గుడ్న్యూస్ (Good news) చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితిని పెంచింది. ఈ మేరకు రెండు వేర్వేరు జీవో (G.O.)లు విడుదల చేసింది. యూనిఫాం సర్వీసులకు రెండేళ్ల పాటు సాధారణ కేటగిరీలో వయోపరిమితిని పెంచింది. మిగిలిన నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రిజర్వుడు (Reserved) కేటగిరీలకు సడలింపులు యథాతథంగా వర్తిస్తాయని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.








