శ్రీవారి భక్తులకు తీపి కబురు
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని అందించనున్నామని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గం నుంచి కాలినడకన వచ్చే 20 వేల మంది భక్తులకు మాత్రమే ఉచిత లడ్డును అందిస్తున్నామని, ఇకపై శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికీ 175 గ్రాముల లడ్డును ఉచితంగా అందిస్తామన్నారు. గత నెల టీటీడీ బోర్డు తీర్మానం మేరకు ప్రతి భక్తునికి ఉచిత లడ్డును అందించనున్నట్లు చెప్పారు.













