మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ ?
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీవిరమణ చేసినట్టు తెలిసింది. ఆయన పెట్టుకున్న దరఖాస్తును సీఎం జగన్ ఆమోదించినట్లు సమాచారం. సోమేశ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశించడంతో ఆయనను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. ఆయన జనవరి 12న అమరావతికి వచ్చి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసిన, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసి నెల రోజులు దాటుతున్నా ఇప్పటివరకూ పోస్టింగ్ ఇవ్వలేదు. సోమేశ్ కుమార్ స్వచ్చంద పదవీవిరమణకు దరఖాస్తు చేసుకోవడమే దానికి కారణమని తెలిసింది.













