Chandrababu: డ్వాక్రా ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి : సిఎం చంద్రబాబు
డ్వాక్రా ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. కలెక్టర్ల (Collectors)తో నిర్వహించిన భేటీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ డ్వాక్రా ఉత్పత్తులను స్వయం బ్రాండ్ పేరుతో ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు. డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అమూల్ (Amul) తరహాలో స్వయం బ్రాండ్ ద్వారా మార్కెటింగ్ చేయాలని చెప్పారు. డ్వాక్రా, మెప్మా ఉత్పత్తులకు స్వయం పేరిట బ్రాండింగ్, లోగో ఏర్పాటు చేశామన్నారు. మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ తరహాలో బ్రాండింగ్‌కు కృషి చేయాలని కోరారు. అమూల్ తరహాలోనే సహకార విధానంలో మార్కెటింగ్ జరగాలన్నారు. డ్వాక్రా మహిళలు రుణాలను తప్పకుండా తిరిగి చెల్లిస్తారని, వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు (Banks) ముందుకు వస్తాయి అని తెలిపారు.

ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








