Chandrababu: అందుకే మావిగన్ వింత ప్రతిపాదన : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కి ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా చేశారని, ఇప్పుడు మావిగన్ అని జగన్ (Jagan) మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. కూటమి నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి (Amaravati)పై ఆయనకు ఉన్న ద్వేషానికి ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరు. అందుకే మావిగన్ (Mavigan) అని వింత పేరును తీసుకొచ్చారు. రాజధాని పట్ల జగన్ వైఖరి భవిష్యత్తులోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైంది అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








