కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమావేశమయ్యారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్-1లోని ఆర్థికశాఖ కార్యాలయంలో భేటీ అయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కేంద్రమంత్రికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు (జీహెచ్‌హెచ్) జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరువురూ చర్చించారు. ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలకు సంబంధించిన అంశంపైనా చర్చలు జరిపారు. ఈ భేటీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు(Lavu Sri Krishna Devarayalu), రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) పాల్గొన్నారు.








