ఛలో ఢిల్లీ అంటున్న చంద్రబాబు, పవన్.. షాక్ లో జగన్..
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఒక పక్క పొత్తుల కసరత్తు జరుగుతుంటే మరోపక్క మద్దతు కోసం మతలబులు మొదలు పెడుతున్నారు నేతలు. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు దక్కాలి అంటే బీజేపీ అండ ఉండాలి అని ఫిక్సయిన బాబు, పవన్ తో కలిసి అధిష్టానంతో ముచ్చటించడానికి ఢిల్లీ పయనమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరి తో పాటు కొందరు ముఖ్య నాయకుల్ని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు ఢిల్లీ పయనమైన బాబు, పవన్ అధిష్టానంతో జరిపే మంతనాల తర్వాత పొత్తు విషయం పై పక్కా క్లారిటీ వస్తుంది. ఒకవేళ బిజెపి కూడా టీడీపీ- జనసేన కూటమితో చేయి కలిపితే.. ఈ మూడు పార్టీలకు సంబంధించి సరికొత్త అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ పొత్తు కోసమే మొదటి విడత జాబితాలో కొన్ని స్థానాలను అట్టిపెట్టారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పొత్తు కన్ఫర్మ్ అయితే ఇక జగన్ సర్కార్ కు ఇది పెద్ద షాక్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు.













