కుమార్తెల దగ్గరకు వైఎస్ జగన్, సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. లండన్‌లో(London) చదువుకుంటున్న తన కుమార్తెలతో సమయం గడిపేందుకు, కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌కు హైదరాబాద్‌లోని(Hyderabad) సీబీఐ ప్రత్యేక కోర్టు సానుకూలంగా స్పందించింది. వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఉన్నత చదువులు పూర్తి చేయగా, రెండో కుమార్తె వర్షా రెడ్డి కూడా అక్కడే చదువుకుంటున్నారు.
గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న జగన్.. ఇప్పుడు తన కుమార్తెల దగ్గరకు లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్‌లోని మరికొన్ని ప్రాంతాలను కూడా ఆయన సందర్శించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి మే 15 వరకు అంటే దాదాపు 25 రోజుల పాటు విదేశాల్లో ఉండేందుకు కోర్టు జగన్‌కు అనుమతినిచ్చింది. అయితే దర్యాప్తు సంస్థల నిబంధనల ప్రకారం ఆయన కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది:
విదేశాల్లో జగన్ వాడే ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలను సీబీఐకి అందజేయాలి. పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ మరియు అవసరమైన ష్యూరిటీని కోర్టుకు సమర్పించాలి. కుమార్తెలతో గడిపే ఈ వ్యక్తిగత పర్యటన ముగించుకుని మే 15 తర్వాత ఆయన తిరిగి రాజకీయాల్లో బిజీ కానున్నారు. జగన్ గైర్హాజరీలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను కీలక నేతలకు అప్పగించినట్లు సమాచారం. జగన్ విదేశీ పర్యటన గతంలో వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. మరి ఈసారి జగన్ జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి








