ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ హోదా
జనసేన నేత, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ(MLC) కొణిదెల నాగేంద్రరావు ( నాగబాబు) (Nagababu)కు కేబినెట్ హోదా (Cabinet rank)ను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వేతన భత్యాలు, సిబ్బంది నియామకం, ఇతర ప్రయోజనాలు ఖరారు చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని పర్యావరణ, అటవీశాఖ (Forest Department) ఉన్నతాధికారులను ఆదేశించింది.








