టీడీపీ-జనసేన కూటమి తో కమలం దోస్తీ పై క్లారిటీ వచ్చేది నేడే…
ఏపీ భవిష్యత్తు కోసం.. ఓట్ల చీలికలు ఉండకూడదు అనే ఉద్దేశంతో.. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడం ధ్యేయంగా సైకిల్ కి సై కొట్టింది జనసేన. ఇక ఈ కూటమితో పాటుగా కమలాన్ని కూడా రంగంలోకి దింపే పనిలో చంద్రబాబు, పవన్ ఇద్దరు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో టిడిపి అధినేత.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ ఇద్దరి మంతనాలు ముగిసిన అనంతరం పొత్తు, సీట్ల అంశంపై అధికారికంగా వెల్లడించే ఆస్కారం ఉంది. ఇప్పటికే జనసేన ఎన్డీఏలో భాగస్వామి కాగా.. తాజా పరిణామాల దృశ్య టీడీపీ కూడా ఆరు సంవత్సరాల తరువాత తిరిగి ఈ కూటమిలో చేరబోతున్నట్లు టాక్. 2019 ఎన్నికలకు ముందు మోడీ విధానాలను విమర్శించిన చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది. దీనికి తగిన మూల్యాన్ని 2019 ఎన్నికల ఓటమితో తెలుగుదేశం పార్టీ చెల్లించుకుంది. ఈసారి ఎన్నికల్లో గెలవాలి అంటే కమలం సపోర్ట్ ఎంతో అవసరం అన్న విషయం తెలుసుకున్న బాబు తిరిగి ఒకప్పటి స్నేహాన్ని పునరుద్ధరించడంలో బిజీగా ఉన్నారు. ఈ కూటమి కన్ఫర్మ్ అయితే జగన్ సర్కార్ కు ఈ కూటమిని ఎదుర్కోవడం కాస్త కష్టమే అవుతుంది.













