Bar License: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం … సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి
పర్యాటకం, ఆతిథ్యరంగానికి ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బార్ల లైసెన్సు ఫీజు(Bar license fees), నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు (Registration charges) తగ్గించింది. ఏడాదికి బార్ల లైసెన్స్ ఫీజును రూ.5 లక్షలుగా నిర్థారించింది. 3 స్టార్, పైస్థాయి హోటళ్లలో రిజిస్ట్రేషనల్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు కుదించింది. నాన్ రిఫండబుల్ ఛార్జీని రూ.20 లక్షలుగా నిర్ధారించింది. ఫీజులు తగ్గించాలన్న హోటల్స్ అసోసియేషన్ (Hotels Association) విజ్ఞప్తి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్టార్ హోటళ్లు ఉన్నచోట బార్ లైసెన్స్‌ల జారీపై నియంత్రణ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబరు 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.













