ఆంధ్రా ఆర్గానిక్స్ రూ.కోటి విరాళం

కోవిడ్ 19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్స్ (విర్కో గ్రూపు) రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍కు ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ (విర్కో గ్రూపు) డైరెక్టర్స్ మహా విష్ణు, సునీల్, లింగారెడ్డి, ఎం.ఫణి కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మరీ ముఖ్యంగా వైద్యాన్ని నిరుపేదలకు చేరువచేయడంలో సీఎం జగన్ మంచి చొరవ చూపుతున్నారని, తమ వంతుగా ఈ విరాళాన్ని ఆయనకు అందించడం జరిగిందని తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో పెద్ద మనసు చాటుకున్న విర్కో గ్రూపు యాజమాన్యానికి ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.