అమరావతి నిర్మాణంలో ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యం
రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్యసమితి (United Nations) ముందుకొచ్చింది. రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అర్బన్ ఇన్నోవేషన్ అండ్ సస్టెయినబిలిటీ (యూఆర్ బీఐఎస్) సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మంత్రి నారాయణ (Minister Narayana) సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ (Suresh Kumar), ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ విభాగాలు, నిపుణులతో కలిసి యూఆర్ బీఐఎస్ (URBIS) పనిచేయనుంది. అమరావతి నిర్మాణంతో పాటు గృహ నిర్మాణం, మురికివాడల అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, తుపానులను సమర్థంగా ఎదుర్కోవడం, మెరుగైన పట్టణ సేవలు అందించడంలో యూఆర్ బీఐఎస్ సహకరించనుంది.








