NTR statue: ఏపీలో అత్యంత భారీ ఎన్టీఆర్ విగ్రహం

రాజధాని అమరావతి (Amaravati) లోని నీరుకొండలో 300 అడుగుల ఎత్తులో భారీ ఎన్టీఆర్ విగ్రహం (NTR statue) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాదపీఠంలో మిని థియేటర్ (Mini theater) , మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్ (convention center) ను కూడా నిర్మించనున్నారు. మంగళగిరి మండలం నీరుకొండ (Neerukonda) గ్రామంలోని కొండపై అతి పెద్దదైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం టెండర్లు పిలిచింది. నీరుకొండలోని కొండపై 300 అడుగుల ఎత్తున్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. వంద అడుగుల ఎత్తులో పాద పీఠం ఏర్పాటు చేసి ఆ పైన రెండు వందల అడుగుల ఎత్తులో విగ్రహాన్ని నిర్మించనున్నట్లు టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాజధానిలో ఏ ప్రాంతం నుంచి చూసిన విగ్రహం కనిపించేలా నిర్మాణం ఉండబోతున్నట్లు తెలుస్తుంది.