సీఎం చంద్రబాబుకు మోదీ విందు ఆహ్వానం
ఢిల్లీలో తాను ఏప్రిల్ 1వ తేదీ రాత్రి ఇస్తున్న విందుకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం అందింది. మలేసియా ప్రధాన మంత్రి మహ్మద్ నజీద్ బిత్ తున్ అబ్దుల్ రజాక్ గౌరవార్థం ప్రధాని మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈ విందు ఏర్పాటు చేస్తున్నారు.







