రాష్ట్రపతిగా వీరైతే ఓకే
ప్రధాని నరేంద్రమోడీకి, భారతీయ జనతా పార్టీకి తలనొప్పిగా మారిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ కురవృద్ధుడు ఎల్.కె అద్వానీ, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్లలో ఎవరిని నిలబెట్టినా తృణమూల్ కాంగ్రెస్ మద్దతిస్తుందని మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మణిపూర్లో బీజేపీకి తృణమూల్ ఎంపీ మద్దతీయడం ఎందుకని ప్రశ్నించగా ఈశాన్య రాష్ట్రాల రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని, రాజకీయాలను డబ్బు శాసిస్తోందని అమె అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించిన ఆ ఎంపీ ఎవరో తనకు తెలియదని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సైతం ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.













