తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అభివృద్ధి
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెట్టాలని నాట్స్ నేషనల్ సర్వీస్ కో ఆర్డినేటర్ కొత్తపల్లి శ్రీకృష్ణ కోరారు. అమెరికాలోని డెట్రాయిట్లో నాట్స్ సహకారంతో ఇండియా సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిక్కిన సావిత్రి, వేములపల్లి పద్మ, ఏవీఆర్ చౌదరి, డాక్టర్ ముక్కాముల అప్పారావు, మోటూరు ప్రవీణ్, రామినేని ఫణి, తమ్మినీడి కిషోర్, ఎం.గౌతమ్, అడుసుమల్లి శివ, కొడాలి శ్రీనివాస్, వీరపనేని విష్ణు, శ్రీధర్, మోహన్, వినోద్, చలపతి, రావిపాటి ప్రసాద్ ప్రసగించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు.













