ఎన్నారైలు ఆధార్ పొందేందుకు అర్హులేనా..?
ఆధార్ కార్డు పొందేందుకు ఎన్నారైలు అనర్హులనీ, ఆధార్ లేదనీ వారు ఆందోళన చెందనవసరం లేద యూఐడీఏఐ(యునిక్యూ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా) సీఈవో డాక్టర్ అజయ్ భూషన్ పాండే స్పష్టం చేశారు. ఆధార్ దరఖాస్తు పత్రంలో ‘భారతీయులకు మాత్రమే’ అనే నిబంధన ఎన్నారైలకు ఆధార్ ఇవ్వొచ్చా..? లేదా..? అనేది తేల్చిచెబుతోందని భూషన్ పాండే అభిప్రాయపడ్డారు. అసలు ఆధార్ కార్డు పొందేందుకు ఎన్నారైలు అనర్హులనీ, ఆధార్ లేదనీ వారు ఆందోళన చెందనవసరం లేదన్నారాయన. భారత్లో ఉండేవారకి, భారతీయులకు మాత్రమే ఈ ఆధార్ ఇస్తారని తెలిపారు. 2016లో ఆమోదించిన ఆధార్ చట్టంలోని సెక్షన్-3.1లో ఈ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఎన్నారైలను ఈ ఆధార్ ప్రక్రియ నుంచి మినహాయించాలా..? తొలగించాలా..? అనే విషయాలపై చట్టంలో క్లారిటీ ఇవ్వలేదన్నారు. భారత చట్టాల ప్రకారం ఓ పౌరుడు దేశంలో వరుసగా 182 రోజుల పాటు నివసించకపోతే.. అతడిని ఎన్నారైగా భావించవచ్చని భూషన్ పాండే స్పష్టం చేశారు. ఇప్పటికే ఆధార్ కార్డును పొంది ఉన్న ఎన్నారైలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లేనని భూషన్ పాండే అభిప్రాయపడ్డారు. ‘అసలు ఆధార్ కార్డు పొందేందుకు వాళ్లు అర్హులు కాదు. భారత్లోనే ఉంటున్నానని డిక్లరేషన్ ఇస్తేనే ఆధార్ ఇస్తారు. ఎన్నారైలు ఆధార్ పొందారంటే.. తప్పుడు సమాచారం ఇచ్చినట్లే కదా..’ అని ఆయన తెలిపారు.







