ఉప రాష్ట్రపతిగా హుకుందేవ్ నారాయణ్!
దేశానికి కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం జులైలో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరిని ఎంపిక చేయాలని బీజేపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. బీహార్‌లోని మధుబని నియోజకవర్గం నుంచి ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఓబీసి నేత, తన ఆవేశపూరిత ప్రసంగాలతో పార్లమెంటును కుదిపేసే హుకుంద్వ్ నారాయణ్ యాదవ్‌ను తదుపరి ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వర్గాల కథనం ప్రకారం, హమీర్ అన్సారీ స్థానంలో హుకుందేవ్ నియామకానికి మోడీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. కులస్తుడైన హుకుందేవ్ ను పోటీకి దింపితే, బీహార్‌లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్) మద్దతు కూడా తమకు లభిస్తుందని, సులువుగానే ఆయన్ను గెలిపించుకోవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.













