ఆ అవకాశం ఎన్నారైలకు మాత్రమే
రద్దైన రూ.1000, రూ.500 నోట్లను జమచేసే అవకాశం ఇక ప్రవాస భారతీయులకు మాత్రమే మిగిలింది. పెద్ద నోట్లు రద్దైన సమయంలో విదేశాల్లో ఉన్నవారు పాత నోట్లను మార్చుకునేందుకు మార్చి 31వ తేదీ వరకూ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసింది. ఆ గడువు కూడా ముగిసిపోయింది. దీంతో మరోవైపు ప్రవాస భారతీయులకు జూన్ 30 వరకూ రద్దైన నోట్లను జమ చేసుకునే వెసులుబాటు ఉంది. అది కూడా కేవలం రూ.25వేలు మార్చుకునే అవకాశం కల్పించారు. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలా రాజ్యసభలో మాట్లాడుతూ అర్హత లేనివారే ఎక్కువమంది ఆర్బీఐ శాఖల వద్ద బారులు తీరుతున్నారని అన్నారు. పాతనోట్ల మార్పిడికి సంబంధించి వెబ్సైట్లో సృష్టమైన నియమ, నిబంధనలు ఇచ్చామని, వాటిని పరిశీలించకుండా సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఆర్బీఐ శాఖలు రావడంతో రద్దీ పెరిగిందని పేర్కొన్నారు.







