రూ.2500కే విమాన ప్రయాణం!
రూ.2500కే దేశీయంగా విమాన ప్రయాణం చేసే అవకాశం త్వరలో సాకారం అయ్యే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశంలో పలు ప్రాంతాల్లో విమాన చార్జీలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 70 విమానాశ్రయాలను కలుపుతూ 128 మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ సౌకర్యం కల్పించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్సిఎస్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) కింద ఐదు విమానాశ్రయాలు విమాన సేవలను అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్సిఎస్ ప్రారంభంలో భాగంగా 44 కొత్త మార్గాలను జత చేర్చనున్నామని, గతంలో విమాన ప్రయాణం ధనికులకే అనేది ఉండేదని, ఇప్పుడు సామాన్య మానవుడికి ప్రయాణించే అవకాశం కల్గుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు.













