వేరుశనగతో హృద్రోగాలు దూరం
రోజువారీ ఆహారంలో వేరుశనగకు చోటిస్తే హృద్రోగాలు దరిచేరవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గుప్పెడు పల్లీలను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. ఇటీవలి అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. ఈ అధ్యయనంలో భాగంగా పదిహేను మంది ఆరోగ్యవంతులైన యువతీయువకులను వారు ఎంచుకున్నారు. వీరిని రెండు గ్రూపులుగా విడదీసి, వారి ఆహారపు అలవాట్లపై పరిశోధన చేసి ఈ విషయాన్ని నిర్ధారించినట్లు వర్సిటీ శాస్త్రవేత్త పెన్నీ క్రిస్ ఎథర్టాన్ తెలిపారు.







