త్వరలోనే ఈ-పాస్‌పోర్టులు!
పాస్‌పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు జోడించి చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్టులను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ-పాస్‌పోర్టులను తీసుకొచ్చేందుకు సన్నాహాలను ప్రారంభించామని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభలో చెప్పారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా టెండర్లను పిలిచే బాధ్యతను నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌కు అప్పగించినట్లు తెలిపారు.







