లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిలు
ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో లాలూతో పాటు ఆయన సతీమణి రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌లకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. నిందితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష, ఒకరి పూచికత్తుతో ప్రత్యేక న్యాయమూర్తి అరుణ్ భరద్వాజ్ వారికి బెయిల్ మంజూరు చేశారు. నిందితులైన లాలూ, రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లకు కోర్టు జనవరి 19న మధ్యంతర బెయిలును పొడిగించింది. ఆ గడువు నేటితో ముగుస్తుంది. దీంతో వారు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. కాగా కోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. రెండు ఐఆర్సీటీసీ హోటల్స్‌ను అక్రమంగా ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టుకు ఇచ్చారని, ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.













