అహ్మద్ పటేల్ కు కష్టమే
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఆరోసారి రాజ్యసభకు ఎన్నిక కావటం ప్రశ్నార్థకంగా మారింది. గుజరాత్ కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు శంకర్‌సింగ్ వాఘేలా బిజెపి ఆధ్యక్షుడు అమిత్ షాతో చేతులు కలపటంతో అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావటం కష్టంగా మారింది. అహ్మద్ పటేల్ ఆరోసారి రాజ్యసభకు ఎన్నిక కాకుండా చూసేందుకు వాఘేలా తన వియ్యంకుడు, కాంగ్రెస్ చీఫ్‌విప్ బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాఘేలా కాంగ్రెస్‌కు రాజీనామా చేయటంతోపాటు తన వెంట పదకొండు మంది శాసన సభ్యులను తీసుకుపోయారు. బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాజ్యసభకు పోటీ చేసేందుకు రంగంలోకి దిగితే అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావటం అసాధ్యమని అంటున్నారు.













