170 జిల్లాలు హాట్‌స్పాట్‌గా గుర్తించిన కేంద్రం
కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత పకడ్బందీగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. దాదాపు 170 జిల్లాలను హాట్‌స్పాట్ కేంద్రాలుగా, రెడ్‌జోన్‌గా గుర్తిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకవేళ రెడ్‌జోన్‌లో 28 రోజుల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాకపోతే అప్పుడు ఆ జోన్‌ను గ్రీన్ జోన్‌గా మారుస్తామని తెలిపింది. ఈ హాట్‌స్పాట్ కేంద్రాల్లో ప్రతి 4 రోజులకు కేసులు రెండింతలు అవుతున్నాయని దాదాపు 23.1శాతం మంది ప్రజలు రెడ్‌జోన్‌లో ఉన్నారని వివరించింది. ఆంధ్రలో కూడా పలు జిల్లాలను రెడ్జోన్లుగా గుర్తించింది. మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా రెడ్జోన్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.













