అమెరికా అధ్యక్షుడి రేసులో సెహ్వాగ్!
అమెరికా తదుపరి అధ్యక్షుడి రేసులో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం సెహ్వాగ్ ఇప్పటికే తరచూ అమెరికా పర్యటనకు వెళ్లి ట్రంప్‌తో టచ్‌లో ఉన్నాడట. అంతేకాదు ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీతో త్వరలో చర్చించాలని అనుకుంటున్నారట. సెహ్వాగ్ అమెరికా అధ్యక్షుడి రేసులో ఉండటం ఏమిటి? అని ఆలోచిస్తున్నారా? ఈ రోజు ఏప్రిల్ 1. పూల్స్ డే. ఇప్పుడు అర్థమైందా పై కథ అంతా దేనికో. పూల్స్ డే సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ వార్త సంస్థ ఈ రోజు ఓ కథానాన్ని ప్రచురించింది. ఆ కథనంలో సెహ్వాగ్ అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నట్లు తెలిపింది. పైగా ఈ కథానాన్ని రాసింది స్టీవ్ స్మిత్ అని తెలిపింది. స్మిత్ ఎవరో తెలుసు కదా. ఆసీస్ క్రికెట్ సారథి. అంతేకాదు మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఏకగ్రీవంగా సెహ్వాగ్ పేరును ఎంపిక చేసినట్లు కథనంలో పేర్కొంది. 2017 చివరిలో ట్రంప్ మోడీ భేటీ అయ్యే సమయంలో ఈ విషయంపై చర్చించనున్నట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం భారత్-ఆసీస్ మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్లు మధ్య మాటల యుద్ధాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీని ట్రంప్‌తో పోలుస్తూ ఆసీస్ మీడియా కథనాలు కూడా ప్రచురించింది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.













