విడిపోయిన కూడా మనమంతా ఒక్కటే : బాలకృష్ణ
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా మళ్లీ మనమంతా ఒక్కటే అనే భావన కలిగించిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ(డీటీఏ) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు, పురస్కారాల ప్రదానోత్సవం తెలుగు లలితకళాతోరణంలో ఘనంగా జరిగింది. ఇదే వేదికపై గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం దర్శకుడు క్రిష్, సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్, నిర్మాణ రాజీవ్ రెడ్డి, కెమెరామెన్ జ్ఞానశేఖర్, ఆర్ట్ డైరెక్టర్ భూపేష్ భూపతి తదితరులకు ఉగాది పురస్కారాలు ఇవ్వడంతోపాటు, నటుడు కైకాల సత్యనారాయణకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినా, ప్రాంతాలు వేరైరా మన భాష తెలుగే అన్నట్లు మనందరినీ మళ్లీ ఒకటిగా చేసిన చిత్రం శాతకర్ణి అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలమంతా అన్నదమ్మూల్లా కలిసి ఉందామంటూ ఉద్యమ సమయంలో చెప్పిన మాట నిజమవుతోందన్నారు.













